విశాఖ శారదా పీఠం ఒక డూప్లికేటు అంటూ గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో డూప్లికేటు పీఠాలు చాలా చోట్ల ఉన్నాయని తెలిపారు. స్వరూపానంద ఎక్కడో సన్యాసం తీసుకుని సాధన చేశారని, ఆయన జనాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాశీలో తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక స్వరూపానంద భయపడి పారిపోయారని ఎద్దేవాచేశారు. కర్ణాటకలోని ఉడయదర్శి దగ్గర పీఠం ఉందని, ఆ పీఠం దగ్గర తాను సన్యాసం తీసుకున్నానని స్వరూపానంద అంటున్నారని గోవిందానంద చెప్పారు. ఆ పీఠాన్ని శంకరాచార్యులు స్థాపించారనే అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు. స్వరూపానంద శంకరాచార్యులు కాదు.. పరమ డూప్లికేటు అని ఆరోపించారు.