నెల వాయిదా కట్టకపోయినా… బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా… భారీగా ఫీజులు వాయిస్తున్న.. బ్యాంకులు పెద్ద పారిశ్రామికవేత్తల రుణాలను డీల్ చేస్తున్న పద్ధతి ఇది. వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన 13 కంపెనీలు తీసుకున్న రుణాలు, వడ్డీ మొత్తం కలిపి రూ. 71,433 కోట్లు కాగా వీటిని చెల్లించడంలో విఫలం కావడంతో కంపెనీ దివాలా తీసింది. ఇపుడు ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్ (ఎన్సీఎల్టీ) వద్ద ఉంది. ఈ రుణాలకు సంబంధించిన కేసును డీల్ చేస్తున్న ముంబై బెంచ్ తుది సెటిల్మెంట్ చూసి ఆశ్చర్యపోయింది. ఈ సెటిల్మెంట్లో బ్యాంకులకు చివరికి మిగిలేది కేవలం రూ. 2,962 కోట్లు మాత్రమే. వీడియోకాన్ గ్రూప్‌తో సహా మొత్తం కంపెనీలకు వేదాంత గ్రూప్‌నకు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ తీసుకోనుంది. అంటే 0.62 శాతం మొత్తంతో ఈ గ్రూప్‌ను టేకోవర్ చేయనుందన్నమాట. పైగా రూ.2,962 కోట్లను వేదాంత కంపెనీ వెంటనే ఇవ్వదు. పలు దఫాలుగా చెల్లిస్తుంది. దాదాపు బ్యాంకులు ఈ డీల్‌కు సిద్ధమయ్యాయి. కాని ఎన్సీఎల్టీనే ఆశ్చర్యపోయింది. ఇంత తక్కువ మొత్తానికి 13 కంపెనీలు ఇచ్చేస్తున్నారా అని?