బులియన్‌ భారీ పతనం

రాత్రి అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్ రిజర్వ్‌ తీసుకున్న నిర్ణయంతో బాండ్‌ ఈల్డ్స్‌, డాలర్‌ భారీగా పెరిగాయి. అమెరికా మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇతర కరెన్సీలతో డాలర్ భారీగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ ఏకంగా 0.85 దాకా పెరిగి 92కే చేరింది. డాలర్‌ దెబ్బకు బులియన్‌ విలవిల్లాడింది. ఔన్స్‌ బంగారం ధర దాదాపు 5 శాతం క్షీణించి 1,771 డాలర్లకు పడిపోయింది. ఇక వెండి ఏడు శాతంపైగా క్షీణించి 25.84 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో క్రూడ్‌ కూడా పతనమైంది. బ్రెంట్‌ క్రూడ్‌ మూడు శాతం క్షీణించి 72.23 శాతానికి చేరగా, WTI క్రూడ్‌ 70డాలర్లకు చేరింది.