కోవీషీల్డ్‌ సైంటిస్ట్‌కు స్టాండింగ్‌ ఓవేషన్‌

వింబుల్డన్‌ అంటేనే టెన్నిస్‌ స్టార్స్‌. టెన్నిస్‌ అభిమానులు. కాని ఈసారి ఆరంభ రోజున సెంట్రల్‌ కోర్టు ప్రత్యేక ఆహ్వానితులకు ఆతిథ్యం ఇచ్చింది. టోర్నీ ప్రారంభానికి ముందు కరోనా కట్టిడికి వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్తలకు సెంట్రల్‌ కోర్టు ఘన స్వాగతం పలికింది. ఆక్స్‌ఫోర్డ్-అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను కనిపెట్టిన యూకే నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సారా గిల్‌బెర్ట్‌తో పాటు వ్యాక్సిన్ అభివృద్దికి కృషి చేసిన ఇతర సిబ్బందిని వింబుల్డన్ నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు. అభిమానులు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు ఒక్కొక్కరుగా స్వయంగా లేచి నిలబడి మరీ చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు.
రెండేళ్ల విరామం తర్వాత వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సోమవారం ప్రారంభమైంది. ఈసారి పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించారు. దీంతో ఈ టెన్నిస్ టోర్నీ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజే జొకోవిచ్, ముర్రే, సిట్సిపాస్ వంటి దిగ్గజాల మ్యాచ్‌లు ఉండటంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

 

Related Articles