ఇన్ఫోసిస్ కూడా టీసీఎస్ బాటలోనే నడించింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను ఇన్ఫోసిస్ కూడా చేరుకోలేకపోయింది. ఈసారి గైడెన్స్ ఇవ్వడం సానుకూల అంశం. జూన్‌తో ముగిసిన త్రైమాసికింలో కంపెనీ రూ. 27,896 కోట్ల ఆదాయంపై రూ. 5,195 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 6 శాతం పెరగ్గా, నికర లాభం 2.34 శాతం పెరిగింది. మార్కెట్ విశ్లేషకులు రూ. 27,718 కోట్ల ఆదాయంపై రూ. 5,402 కోట్ల నికరలాభాన్ని అంచనా వేశారు. ఆదాయం అంచనాల మేరకు ఉన్నా.. నికర లాభం నిరాశపర్చింది. కంపెనీ మార్జిన్ కూడా అంచనాల మేరకు లేదు. గత త్రైమాసికంలో డిజిటిల్ బిజినెస్ 9.7 శాతం పెరగ్గా, కోర్ బిజినెస్ 0.7 శాతం తగ్గింది. కంపెనీ మొత్తం ఆదాయంలో 53.9 శాతం ఆదాయం డిజిటల్ బిజినెస్ నుంచి రావడం విశేషం. మార్కెట్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న గైడెన్స్‌ను ఇన్ఫోసిస్ ఇవాళ ఇచ్చింది. 2021-22 ఎబిటా మార్జిన్ 12-14 శాతం నుంచి 14-16 శాతానికి పెరుగుతుందని పేర్కొంది.