నిర్మాతగా మారిన తాప్సి

బాలీవుడ్‌ నటి తాప్సి పన్ను నిర్మాతగా మారారు. ఔట్‌సైడర్‌ ఫిలిమ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పరిశ్రమలో అడుగు పెట్టి పదేళ్ళయిందని, పరిశ్రమలో తనను ఆదరించినవారందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. పరిశ్రమలో ఈ స్థాయికి వస్తానని తాను కలలో కూడా అనుకోలేదని, తన పనిని, తనను ఇంతగా అభిమానించిన పరిశ్రమలో తిరిగి ఇచ్చే ప్రక్రియలో ఈ కొత్త బాధ్యతను తీసుకుంటున్నానని ఆమె ట్వీట్‌ చేశారు.