జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎలాంటి కెమెరా, వెబ్‌క్యామ్ అవసరం లేకుండానే టీవీ నుంచి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ‘కెమెరా ఆన్ మొబైల్’ పేరుతో తీసుకొచ్చిన ఫీచర్ ద్వారా ఈ వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ ‘జియో జాయిన్’ యాప్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు అందుబాటులో ఉంది.
వీడియో కాల్స్ కోసం ఫోన్ కెమెరాను ఇది ఇన్పుట్ డివైజ్‌గా మార్చేస్తుంది. ఫలితంగా టీవీ ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, జియో ఫైబర్ యూజర్లు తమ మొబైల్లోని జాయిన్ జియో యాప్ ద్వారా తమ ల్యాండ్‌లైన్ నంబరు నుంచి వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు.
మొబైల్‌ను ఉపయోగించి టీవీ ద్వారా వీడియో కాల్స్ చేసుకునేందుకు… తొలుత పది అంకెల జియో ఫైబర్ నంబరును జాయిన్ జియో యాప్‌లో జోడించాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత జియో జాయిన్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘కెమెరా ఆన్ మొబైల్’ పీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అంతే.. ఫోన్‌ను వెబ్‌కామ్‌గా ఉపయోగించి ఎంచక్కా టీవీ ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
వీడియో కాల్స్ స్పష్టంగా ఉండాలంటే తమ మోడెమ్స్‌ను 5GHz వై-ఫై బ్యాండ్‌గా మార్చుకోవాలని జియో ఫైబర్ చెబుతోంది. 2.4GHz బ్యాండ్‌లో వీడియో కాల్స్ చేసుకోవచ్చు కానీ చిత్రం అంత స్పష్టంగా ఉండదని తెలిపింది.