ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని పాకిస్తాన్ కేబినెట్ నిర్ణయించింది. వాస్తవానికి ఈ నివాసంలో ప్రధాని ఉండటం లేదు. 2019లో ఎన్నికల్లో గెలిచిన వెంటనే ప్రధాని ఇంత సువిశాలమైన, విలాసవంతమైన భవనం అక్కర్లేదని ఆయన వేరే నివాసంలో ఉంటున్నారు. పాకిస్తాన్ బడ్జెట్ పత్రాల ప్రకారం కేవలం ప్రధాని నివాసం నిర్వహణ కోసం ఏడాదికి రూ. 47 కోట్లు వ్యయం అవుతోంది. అంత ఖర్చు భరించి ఆ ఇంట్లో ఉండటం అనవసరమని, ఆ ఇంటిని ఓ ప్రముఖ కేంద్ర విద్యాలయంగా మార్చాలని ఆయన ప్రతిపాదించారు. గత రెండేళ్లలో రెండు కమిటీలు వేసినా ప్రయోజనం లేకపోయింది. యూనివర్సిటీగా మార్చేందు… ఖాళీగా ఉన్న నివాసాన్ని సాంస్కృతిక, విద్యా, ఫ్యాషన్ సంబంధిత కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ సమయంలో ప్రధాని నివాసానికి ఉన్న హోదాకు ఎక్కడ భంగం కలగకుండా నిర్వహించాలని ప్రతిపాదించారు.