“స్వర్ణమే” లక్ష్యం

చిబా (జపాన్‌): నేడు పురుషుల ఫ్రీస్టయిల్‌ 57 కిలోల విభాగంలో జరిగే ఫైనల్ పోరులో భారత యువ రెజ్లర్‌ రవికుమార్‌ దహియా .. ప్రపంచ చాంపియన్, రష్యా క్రీడాకారుడు జవురు ఉగుయేవ్ తో తలపడతాడు. ఈ పోటీల్లో అండర్ డాగ్ గాబరిలోకి దిగిన దహియా.. వరుసగా సంచలనాలు నమోదు చేశాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్లో కజకిస్థాన్‌ రెజ్లర్‌ నురిస్లామ్‌ సనయేవ్‌ను 9-7 తేడాతో ‘విక్టరీ ఫాల్‌’ పద్దతిలో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ప్రత్యర్థి తనపై ఆధిక్యంలో ఉన్నా.. ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని రవి పైచేయి సాధించాడు. హరియాణాలోని ఓ మారుమూల పల్లెటూరులోని రైతు కుటుంబానికి చెందిన రవికుమార్‌.. అత్యున్నత వేదికపై పతకాన్ని ఖరారు చేసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు

Related Articles