ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయం పెంపు

పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఖర్చు పెట్టే మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. సిక్కిం, గోవా, అరుణాచల్‌ ప్రదేశ్‌ వంటి చిన్న రాష్ట్రాలతో పాటు చాలా వరకు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీ అభ్యర్థి ఎన్నిక వ్యయం రూ. 75లక్షలకు పెంచారు. అదే అసెంబ్లీకైతే రూ.28 లక్షలు చేశారు. మిగిలిన రాష్ట్రాల్లో ఎంపీకి రూ. 95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థికి రూ. 40లక్షలుగా నిర్ణయించారు.ఇప్పటి దాకా పార్లమెంటు స్థానానికి రూ. 70 లక్షలు, ఎమ్మెల్యే స్థానానికి పరిమితి రూ. 28 లక్షలుగా ఉండేది.