మంచులో గడ్డకట్టిన కార్లు

పాకిస్తాన్‌లోని ముర్రేలో ఇవాళ అకస్మాతుగా భారీగా మంచు కురవడంతో 30 మంది మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సిలోని ముర్రే పట్టణ ప్రాంతంలో… ఏటా శీతాకాలంలో మంచుకురుస్తుంది. చాలా మంది టూరిస్టులు క్రిస్మస్‌ నుంచి జనవరి నెల వరకు అక్కడికి వెళతుంటారు. హోటల్స్‌ సహా టూరిస్టులకు అసవరమైన ఏర్పాట్లు ఉండటంతో వేలాది మంది వెళుతుంటారు. ముఖ్యంగా జనవరి మొదటి, రెండు వారాల్లో మంచు బాగా కురుస్తుంది. పాకిస్తాన్‌లో అత్యంత బిజీ టూరిస్ట్‌ కేంద్రం ముర్రే. శీతాకాలంలో కురిసే మంచు చూడాలని… అక్కడే కొన్ని రోజులు ఉండాలంటూ చాలా మంది కుటుంబాలతో కార్లలో బయలుదేరారు. ఇవాళ సాయంత్రం అనూహ్యంగా భారీగా మంచు కురవడంతో అనేక కార్లు మంచులో కూరుకుపోయాయి. వేల సంఖ్యలో కార్లు ఒకే రోడ్డుపై వెళుతుండటంతో … ఒక్కసారిగా ఇరుక్కుపోయాయి. ముందుకు, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. పై నుంచి భారీగా పడిన మంచులో చాలా కార్లు ఇరుక్కుపోయాయి.కారు మొత్తం గడ్డకట్టడతో అందులో ప్రయాణిస్తున్నవారు చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే ముర్రేవాసులు ఘటనా స్థలానికి వచ్చి సహాయక కార్యక్రమాలను చేపట్టారు. ఈలోగా ఆర్మీతో పాటు వైమానిక దళాలను రంగంలోకి దిగాయి. వేల మందిని రక్షించినట్లు సమాచారం. అయితే ఇంకా 3,000 కార్లు మంచు పడిన ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులు భారీగా మంచు కురిసే అవకాశముందని పోలీసులు వారించినా… జనం వారిని కాదని ముందుకు సాగినట్లు తెలుస్తోంది.

Related Articles