AP Fibernet: ఫైబర్‌నెట్‌ బేసిక్‌ ప్యాకేజీ ధర పెంపు?

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఇప్పటికే రెండుసార్లు ఫైబర్‌నెట్‌ బేసిక్‌ ప్యాకేజీ ధరలను పెంచిన ప్రభుత్వం.. మూడోసారి వినియోగదారులపై ఛార్జీల భారాన్ని వేయడానికి రంగం సిద్ధం చేసింది. బేసిక్‌ ప్యాకేజీ ధరను రూ.350 నుంచి రూ.399కి పెంచాలని ప్రతిపాదించింది. ఛార్జీల పెంపుతో నెలకు రూ.6.25 లక్షల వంతున.. ఏటా రూ.75 లక్షల భారం ప్రజలపై పడనుంది. ఈనెల 21న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ఛార్జీల పెంపు తీర్మానాన్ని ఆమోదం కోసం ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ట్రిపుల్‌ ప్లే సర్వీసు బాక్సుల ద్వారా వినియోగదారులకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, కేబుల్‌, ల్యాండ్‌లైన్‌ సేవల సదుపాయాలను సంస్థ అందిస్తోంది.

Related Articles