సైఫ్ అమాయకుడు..

ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిని కేఎంయూ పీజీ మెడికో ప్రీతి.. చివరికి తుదిశ్వాస విడిచింది. కన్నకూతురు కన్నుమూసిందన్న వార్తతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులతో పాటు పెద్దఎత్తున వచ్చిన కుటుంబసభ్యులు, మెడికల్ విద్యార్థులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేఎంసీ పీజీ డాక్టర్లు, జూనియర్‌ డాక్టర్లు సైఫ్‌కు మద్దతుగా ఆందోళన చేపట్టారు. అనసవరంగా సైఫ్‌పై ఆరోపణలు చేస్తున్నారంటూ విధులను బహిష్కరించారు. కేఎంసీలో ర్యాగింగ్‌ ఘటనలు లేవని, అనవసరంగా సైఫ్‌పై ఆరోపణ లు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. సైఫ్‌ అమాయకుడని, ఆయనకు ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనకు ఏ మాత్రం సంబంధం లేదని తెలి పారు. వైద్యవృత్తిపై ఉన్న గౌరవాన్ని కాపాడాలని, నేరం రుజువుకానంత వరకు ఏ వ్యక్తి నిందితుడు కాదని పేర్కొన్నారు. ‘ఆధారాలు లేని ఆరోపణలు వద్దు.. డాక్టర్‌ కులమతాలకు అతీతుడు’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. సైఫ్‌ను బలిపశువును చేయోద్దంటూ నినాదాలు చేశారు. కాగా, మెడికోల విధుల బహిష్కరణతో ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. జూనియర్‌ డాక్టర్లు లేక ఆస్పత్రి బోసిపోయి కనిపించింది.