గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెలంగాణ సర్కార్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్పిడి చేసింది. పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం స్థానంలో మరో వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇంతకు ముందు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచు ఆగిపోతూ ఇబ్బంది పెడుతుందని చాలా సార్లు సీఎం కేసీఆర్, డీజీపీ, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు రాజాసింగ్. అయితే.. ఆ విషయంలో ప్రభుత్వం సరిగా స్పందిచకపోయేసరికి.. ఈ మధ్యే తన పాత వాహనాన్ని ప్రగతిభవన్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం.. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన తన బుల్లెట్ బైక్ మీద వచ్చారు. ఈ నేఫథ్యంలోనే.. రాజాసింగ్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్, మెస్సేజ్‌లు రావటం గమనార్హం. ఈ క్రమంలోనే రాజాసింగ్‌కు పోలీసులు సోమవారం రోజున ఇంకో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు.