రాష్ట్రంలో ఆరు ప్రధాన అర్బన్ మండలాలను పునర్వ్యవస్థీకరించి, కొత్తగా ఆరు రూరల్ మండలాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ ఈ మేరకు ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్బన్ మండలాల విభజన, రూరల్ మండలాల ఏర్పాటుపై నెలరోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్కు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయనగరం, ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, మచిలీపట్నం అర్బన్ మండలాలను రెవెన్యూ పరిపాలనా సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా విజయనగరం రూరల్, ఒంగోలు రూరల్, నంద్యాల రూరల్, చిత్తూరు రూరల్, అనంతపురం రూరల్ మండలాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం అర్బన్ మండలాన్ని ఉత్తరం, దక్షిణ మండలాలుగా విభజించారు.