హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్లో రెండు రోజులపాలటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లను మూసివేయనున్నారు. శాంతిభద్రతలకు భంగం కలుగకుండా షాపులు మూసేయాలని ఇప్పటికే వైన్స్ నిర్వాహకులను ఆదేశించామని పోలీసు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా మందుతాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.