ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణను ఈ నెల 11కు హైకోర్టు వాయిదా వేసింది. ఆలోపు చర్చలు జరపాలని ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులకు ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. శుక్రవారం దానిపై విచారణ జరిపే అవకాశముంది. అంతకుముందు వాదనల సందర్భంగా .. అధికారులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం తప్పుబట్టింది.