వెంకీ మామ… బాక్సాఫీస్‌ పండుగ

వెంకీ మామ బాక్సాఫీస్‌ వద్ద పండుగ చేసుకుంటున్నాడు. ఎలాంటి హాలిడేస్‌ లేకున్నా… ఓపెనింగ్‌ డే ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్‌లో రికార్డు సృష్టిస్తున్నాడు. నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ అందించిన సమాచారం మేరకు తొలిరోజునే రూ. 16.5 కోట్లను కొల్లగొట్టాడు. వెంకీ, చైతన్య కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్‌గా సిని వర్గాలు అంటున్నాయి. వెంకీ కెరీర్‌లో ఎఫ్‌2, చైతన్య కెరీర్‌లో మజిలీ… ఇప్పటి వరకు కలెక్షన్స్‌లో టాప్‌గా ఉన్నాయి. ఈ రికార్డును వెంకీ మామ తుడిచిపెట్టేసింది.

Related Articles