‘వెంకీ మామ’ మొత్తం సినిమా లీక్‌

బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న వెంకీ మామ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే లీకైంది. పైరసీకి పెట్టింది పేరైన తమిళ్‌రాకర్స్‌ వెబ్‌సైట్‌ మొత్తం సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టింది. కొన్ని వెబ్‌ సైట్స్‌ సినిమా చూసేందుకు మాత్రమే ఆన్‌లైన్‌ పెట్టగా, కొన్ని పోర్టల్స్‌ ఏకంగా సినిమా డౌన్‌లోడ్‌కు కూడా వీలు కల్పించారు. ఇటీవల కొత్త సినిమాలకు ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఏడాది మజిలి, డియర్‌ కామ్రేడ్‌, మహర్షి, జెర్సి, కాంచన 3 సినిమాలన్నీ విడుదలైన రోజు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

Related Articles