రేపటి నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి

రేపటి నుంచి అన్ని రకాల వాహనదారులు ఫాస్టాగ్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ పద్ధతిలోనే టోల్‌ కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫాస్టాగ్‌ను ప్రభుత్వం ఉచితంగా అందించింది. రేపటి నుంచి ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ వసూలుకు నేషనల్‌ హై వే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సిద్ధమైంది. దీనివల్ల టోల్‌గేట్ల వద్ద రద్దీ బాగా తగ్గే అవకాశముంది. ఇప్పటికీ ఫాస్టాగ్‌ కొనుగోలు చేయని వారి అమెజాన్‌ డాట్‌ కామ్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు. ఇంకా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌తో పాటు మరికొన్ని సంస్థల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు.

Related Articles