ఫాస్టాగ్‌ బ్యాలెన్స్‌ చూసుకోండి…

సొంత వాహనాల్లో సొంత ఊళ్ళకు టోల్‌ప్లాజాల వద్ద జాప్యం లేకుండా సాఫీగా సాగాలంటే ఫాస్టాగ్‌ తప్పనిసరి. చాలామంది వాహనదారులు ఫాస్టాగ్‌ యాప్‌లో నగదు ఉందో లేదో చూసుకోవడం లేదు. టోల్‌ప్లాజాకు వచ్చాక బ్యారియర్‌ పైకి లేవకపోవడంతో ఫాస్టాగ్‌ బ్లాక్‌ లిస్టులో పడిందని తెలుస్తుంది. కాని ఏం లాభం వెనక్కి వెళ్లి రెండింతల అదనంగా టోల్‌ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. టోల్‌ప్లాజా దగ్గరికి వచ్చాక రీఛార్జీ చేసినా… యాక్టివేషన్‌ కావడానికి 15 నిమిషాలకు పైగా సమయం పడుతుంది.దీనికి తోడు నెట్‌వర్క్‌ సమస్య ఉంటే ఇంకా ఆలస్యం అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంటి నుంచి బయలు దేరే సమయంలోనే ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ ఉండేలా చూసుకోంది. పైగా బ్యాంక్‌ అకౌంట్‌లో ఉండాల్సిన, మినిమం బ్యాలెన్స్‌కు అదనంగా టోల్‌ చార్జి మొత్తం ఉండేలా చూసుకోండి.

Related Articles