మతాలతో మొదలై… చివరికి నిమ్న, బలహీన వర్గాల విభజన వరకు ప్రస్తుత పాలకు విధానాలు కొనసాగుతాయని, జనం జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ నటుడు సిద్ధార్థ్ హెచ్చరించారు.
‘తొలుతు ముస్లిముల ఫిల్టర్ చేస్తారు. తరవాత క్రిస్టియన్లను, ఆ తరవాత ఇతర మతస్తులను. ఆ తరవాత అణగారిని వర్గాల జోలికి వస్తారు. మహిళ హక్కులను హరిస్తారు. విభజించడానికి ఏదో మార్గం వెతుకుతారు. విద్వేషం కల్గించడానికి మార్గం కనుక్కొంటారు. అదే వారి మార్గం. కాబట్టి ఫాసిజానికి నో. సేవ్ ఇండియా’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.
అలాగే ఆర్థిక వ్యవస్థ గురించి ఎంత మంది మాట్లాడుతున్నారు? ప్రజల దృష్టిని మరల్చడం, మోసం చేయడం, బుకాయించడం. ఇవన్నీ ఫాసిస్టుల ఆయుధాలు… జాగ్రత్తగా ఉండండి. ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబడండి. న్యాయ కోసం పోరాడండని పిలుపు ఇచ్చారు సిద్ధార్థ్.
And look how many people are talking about the economy. Distraction. Deception. Denial. These are the tools of fascists. Beware. Stand against fascism. Fight for what is right! #India
— Siddharth (@Actor_Siddharth) December 18, 2019