CAA: బీజేపీ మరో ఎన్నికల అస్త్రం

లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే సీఏఏ అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 2019లో రూపొందించిన సీఏఏ చ‌ట్టాన్ని ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్ళూ దాని ఊసు ఎత్తని బీజేపీ ప్రభుత్వం సీఏఏను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. లోక్‌స‌భ ఎన్నిక‌లలోపే దీన్ని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌నున్నట్లు అమిత్‌ చెప్పారు. ఢిల్లీలో టైమ్స్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ 370 సీట్లు గెలుస్తుంద‌న్నారు. సీఏఏ గురించి ముస్లిములను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని, వాళ్ల‌ను రెచ్చగొట్టార‌ని అన్నారు. ఈ చట్టం వల్ల ఉన్నవారి పౌరసత్వం పోదని ఆయనఅన్నారు. పాక్‌, ఆఫ్ఘ‌న్‌, బంగ్లా నుంచి భార‌త్‌కు వ‌చ్చిన వారికి పౌర‌సత్వాన్ని ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ముస్లిమేతరులకు మాత్రం పౌరసత్వాన్ని ఇస్తారు. ఉమ్మడి పౌర స్మృతి అమ‌లు కూడా రాజ్యాంగ ల‌క్ష్యమ‌ని అమిత్‌ షా అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related Articles