ప్రముఖ నిర్మాత దిల్ రాజు పెళ్ళి నిన్న రాత్రి పదిగంటలకు నిజామాబాద్ జిల్లా నర్సింగ్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. ఈ పెళ్ళికి పరిమిత సంఖ్యలో మిత్రులు, బంధువులు హాజరయ్యారు. తన పెళ్ళి ఆదివారం జరుగుతున్నట్లు ఆయన పరోక్షంగా తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ అకౌంట్లో పెట్టారు.