మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. `ఆచార్య` సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సమయంలో ఆయన కోవిడ్
టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌గా ఫలితాలు వచ్చినట్లు ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. గత 4-5 రోజుల్లో తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
“ఆచార్య` షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాన`ని చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020