భారీ లాభాలతో 12,900పైన ప్రారంభమైన నిఫ్టి 10.30 గంటలకల్లా ఇవాళ్టి కనిష్ట స్థాయి 12,797కు పడింది. అక్కడి నుంచి కాస్త పెరిగినా.. ఉదయం నాటి స్థాయిని మళ్ళీ అందుకోలేకపోయింది. ముగింపు ముందు కాస్త ఒత్తిడి వచ్చినా…క్రితం ముగింపుతో పోలిస్తే 94 పాయింట్ల లాభంతో 12,874 వద్ద ముగిసింది. మిడ్ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు వ్యాక్సిన్ ర్యాలీకి బ్రేక్ వేసినా…మన మార్కెట్‌లో లాభాల్లో క్లోజ్ కావడానికి ప్రధాన కారణం… నిన్న మన మార్కెట్లకు సెలవు కావడమే. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇవాళ టాటా గ్రూప్ షేర్లు వెలుగులో ఉన్నాయి. అద్భుత ఫలితాలు ప్రకటించిన టాటా స్టీల్‌తో పాటు టాటా మోటార్స్ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా మోటార్స్ 158.00 6.15
టాటా స్టీల్ 521.60 5.97
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 672.50 5.72
ఎస్‌బీఐ 241.35 5.09
అదానీ పోర్ట్స్ 378.40 3.36
నిఫ్టి టాప్ లూజర్స్
బీపీసీఎల్ 395.30 -4.25
హీరో మోటో 3,034 -2.62
ఎన్‌టీపీసీ 88.60 -2.53
ఐఓసీ 84.95 -1.96
ఓఎన్‌జీసీ 71.25 -1.93