మన మార్కెట్లకు ఇపుడు అమెరికా పరీక్ష మొదలైంది. జార్జియా సెనెట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు గెలిచే పక్షంలో… స్టాక్ మార్కెట్‌లో తీవ్ర మార్పులకు అవకాశముందని భావిస్తున్నారు. అందుకే రాత్రి భారీ లాభాలతో ముగిసిన అమెరికా ఫ్యూచర్స్ ఇపుడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చాలా వరకు ఆసియా మార్కెట్లు స్థిరంగా ఉంటూ.. అమెరికా పరిణామాలను గమనిస్తున్నాయి. నిఫ్టి 14200 ప్రాంతంలో కాస్త అటూ ఇటుగా ట్రేడవుతోంది. డెమొక్రటిక్ అభ్యర్థులు గెలిస్తే… అధ్యక్షస్థానంతో పాటు సెనేట్, కాంగ్రెస్ డెమొక్రట్ల ఆధీనంలోకి వస్తాయి. అంటే ఇక బాండ్స్‌పై ఈల్డ్ పెరగడం ప్రారంభమౌతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే ఇపుడు వర్ధమాన దేశాలకు తరలి వస్తున్న అమెరికా నిధులు ఆగిపోయే అవకాశం అధికంగా ఉంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కరెన్సీ మార్కెట్‌ను కూడా గమనించాల్సిన పరిస్థితి. డాలర్ ఇండెక్స్ ఏ మాత్రం పెరిగినా అది మార్కెట్‌కు నెగిటివ్‌గానే భావించాలి. అలాగే రష్యా నిర్ణయంతో ముడి చమురు ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అంటే ఇప్పటి వరకు లక్షల కోట్లు వెనక్కి వేసుకున్న మోడీ సర్కారకు నిధుల కొరత పెరుగుతుంది. షేర్ల ధరలు రెట్టింపు అయినా… ఆయా కంపెనీల లాభాల్లో కనీసం 5 శాతం పెరుగుదల లేదన్న విషయం గుర్తించాలి. ఫార్మా మినహా ఐటీ కంపెనీల మార్జిన్స్‌లో పెద్ద వృద్ధి లేదన్న విషయాన్ని గమనించాలి. సో… ఇక నుంచి ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి.
నిఫ్టి టాప్ గెయినర్స్
గెయిల్ 133.85 3.52
ఓఎన్‌జీసీ 98.00 3.21
టైటాన్ 1,607.00 2.29
ఎస్‌బీఐ 287.40 2.01
ఐఓసీ 94.75 1.88
నిఫ్టి టాప్ లూజర్స్
ఐటీసీ 207.70 -1.77
హెచ్‌యూఎల్ 2,428.00 -0.92
రిలయన్స్ 1,950.00 -0.82
ఐషర్ మోటార్స్ 2,660.75 -0.53
టీసీఎస్ 3,080.00 -0.42