నిస్తేజంగా ప్రారంభమైన నిఫ్టి

గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన అంతర్జాతీయ మార్కెట్లు రాత్రి చల్లబడ్డాయి. అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. లాభనష్టాలు పెద్దగా లేవు. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. కొన్ని మార్కెట్లు ఒక శాతం వరకు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు డల్‌గా ప్రారంభమయ్యాయి. నిఫ్టి నష్టాల్లో ఉన్నా… నామమాత్రమే. ప్రస్తుతం నిప్టి 32 పాయింట్ల నష్టంతో 14,758 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌, ఆటో షేర్లలో స్వల్ప ఒత్తిడి కన్పిస్తోంది. ఒక గంట తరవాత నిఫ్టిపై క్లారిటీ రావొచ్చు. మిడ్‌ క్యాప్‌ షేర్లు కూడా స్థిరంగా ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హిందాల్కో 264.25 2.72
హీరోమోటోకార్ప్‌ 3,465.15 2.49
భారతీ ఎయిర్‌టెల్‌ 621.50 2.08
ఎం అండ్‌ ఎం 850.20 2.04
బజాజ్‌ ఆటో 4,309.00 1.71

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,029.50 -1.82
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,546.60 -1.79
ఏషియన్‌ పెయింట్స్‌ 2,424.15 -1.20
ఐసీఐసీఐ బ్యాంక్‌ 615.45 -1.11
యాక్సిస్‌ బ్యాంక్‌ 726.45 -1.00

Related Articles