50 ఏళ్ళ కార్మికుల శ్రమ, శ్వేదం… అమ్మేస్తారా?

సమిష్టి కృషితో 50 ఏళ్లకు పైబడి అభివృద్ధి చేసుకున్న కార్మికుల శ్రమ శ్వేదం.. విశాఖ ఉక్కు కర్మాగారమని, అలాంటి సంస్థను ప్రైవేటు పరం చేయడమేనా మనం సాధించిన అభివృద్ధి? అని ప్రశ్నించారని నటుడు నారా రోహిత్‌. ప్రజాస్వామ్య కార్యక్షేత్రంలో పిడికిలి బిగిద్దామని, గొంతు పెగలించి విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని నినదిద్దామని ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘కూల్చడాని కది ఆవాసం కాదు. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు. 32 మంది తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశార’ని రోహిత్‌ అన్నారు.

ఇవాళ ఉక్కు పరిశ్రమ ఉనికి ప్రమాదంలో పడుతోందని.. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడిందని రోహిత్‌ అన్నారు. ఆంధ్రుడా మేలుకో అంటూ పిలుపు ఇచ్చారు.

Related Articles