వద్దంటే డబ్బు. బ్యాంకుల వద్ద లక్షల కోట్లు మూల్గుతున్నాయి. ఏదైనా కాస్త దారి చూపుతుందేమోనని ఆశించిన బ్యాంకులు నిరుత్సాహపడ్డాయి. వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్బీఐ, జీడీపీ ఇంకా తగ్గుతుందని, ద్రవ్యోల్బణం 5శాతం పైనే ఉంటేందని పేర్కొంది. ఆర్బీఐ పరపతి విధానం తరవాత నిఫ్టి స్వల్పంగా తగ్గినా.. మిడ్ సెషన్లో కాస్త మద్దతు అందడంతో నిఫ్టి మళ్ళీ గ్రీన్‌లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా యూరో మార్కెట్లు ఇవాళ కూడా నిస్తేజంగా మారడంతో నిఫ్టి మళ్ళీ క్షీణించి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15,622కి క్షీణించింది. అధిక స్థాయిలో అమ్మినవారికి వంద పాయింట్లు లాభం దక్కింది. క్లోజింగ్‌లో కోలుకునే ప్రయత్నం చేసినా నష్టాల్లోనే ముగిసింది. వరుసగా రెండో రోజు 15,700 దిగువ 15,670 వద్ద 20 పాయింట్ల నష్టంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టి ఒక శాతం క్షీణించింది. మిడ్ క్యాప్ షేర్ల సూచీ ఇవాళ కూడా 0.9 శాతం లాభంతో ముగియడం విశేషం.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా మోటార్స్ 336.80 3.42
గ్రాసిం 1,507.00 3.31
కోల్ ఇండియా 153.20 2.78
బజాజ్ ఫిన్ సర్వ 12,125.00 2.58
ఓఎన్జీసీ 125.15 2.16
నిఫ్టి టాప్ లూజర్స్
నెస్లే ఇండియా 17,443.00 -2.00
ఎస్బీఐ 434.30 -1.22
హిందాల్కో 394.75 -1.11
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1,503.65 -1.11
యాక్సిస్ బ్యాంక్ 742.80 -1.05