దేశంలో 5జీ టెక్నాలజీ ప్రవేశపెట్టకూడదంటూ నటి జూహీచావ్లా వేసిన కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. చట్టాన్ని జూహీ చావ్లా దుర్వినియోగం చేశారంటూ ఆమెపై రూ. 20 లక్షల జరిమానా విధించింది. కేసును కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె వేశారని కోర్టు అభిప్రాయపడింది. గత విచారణ సమయంలో కోర్టు వర్చువల్ విచారణ జరుగుతుండగా… విచారణ జరుగుతున్న లింక్‌ను ఆమె తన ట్వీట్ అకౌంట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీంతో విచారణ సమయంలో కొందరు పాటలు కూడా పాడి.. విచారణకు ఆటంకం కల్గించారు.