హోటళ్ళు, రెస్టారెంట్ల టేక్ఆవే అంటే పార్సిల్ ఆర్డర్లపై సర్వీస్ ట్యాక్స్ వర్తించదని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని అంజప్పర్, తలప్పకట్టి, సంగీత హోటల్స్తోపాటు పలుఉ రెస్టారెంట్లు వేసిన పిటీషన్ను విచారించిన జస్టిస్ అనితా సుమంత్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. టేక్అవే ఆర్డర్లపై సర్వీస్ట్యాక్స్ కట్టాల్సిందిగా జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఈ హోటల్స్ కోర్టులో సవాలు చేశాయి. రెస్టారెంట్లు ఆహార పదార్థాలను కేవలం అమ్మకానికి మాత్రమే పెట్టాయని, అక్కడ తినడం లేదని, సర్వీసు ఉండదని రెస్టారెంట్లు వాదించాయి. ఇది కేవలం అమ్మకానికి సంబంధించిన వ్యాపార లావాదేవీ (sale activity) మాత్రమేనని తెలిపాయి. రెస్టారెంట్ సర్వీస్ అంటే కస్టమర్ల కోసం సీట్ల ఏర్పాట్లు, ఎయిర్ కండీషన్, టేబుల్ సర్వీస్, మ్యూజిక్, ఆతిథ్యం కల్పించే ఇతర ఏర్పాట్లు చేయాలని… అవేవీ ఇక్కడ లేవని పేర్కొన్నాయి.