నిఫ్టిలో మళ్ళీ అదే ట్రెండ్‌

నిన్న మాదిరిగానే నిఫ్టి ఇవాళ కూడా ఒక రేంజ్‌కు పరిమితమై ట్రేడవుతోంది. ఉదయం నిఫ్టి చలనంపై అనుకున్నట్లు 15700 దిగువన నిఫ్టికి మద్దతు లభించగా, 15,780 ప్రాంతంలో ఒత్తిడి వచ్చింది. ప్రారంభమైన కొద్దిసేపటికే ఇవాళ గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే ఇవాళ్టి కనిష్ఠ స్థాయిని తాకింది. దిగువ స్థాయి నుంచి 75 పాయింట్లు లాభపడింది. అలా ఉదయం షార్ట్ చేసినేవారికి, ఆ తరవాత దిగువస్థాయిలో కొనుగోలు చేసినవారికీ లాభాలు వచ్చాయి. ఉదయం అనుకున్నట్లు నిన్నటి క్రితం స్థాయి 15,725 నిఫ్టికి ఇవాళ కూడా కీలకంగా మారింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 12 పాయింట్ల నష్టంతో 15,739 వద్ద ముగిసింది. ఇవాళ బ్యాంక్‌ షేర్లలో ఒత్తిడి కన్పించినా… ఐటీ షేర్ల నుంచి వచ్చిన అండగా నిఫ్టి దాదాపు స్థిరంగా ముగిసింది. మిడ్‌ క్యాప్‌ షేర్లు కూడా ఇవాళ స్థిరంగా క్రితం ముగింపు వద్దే క్లోజయ్యాయి. పొజిషనల్‌ ట్రేడర్‌కు ఇవాళ అదనంగా ఏమీ దక్కలేదు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టెక్‌ మహీంద్రా 1,058.35 2.32
హెచ్‌సీఎల్‌ టెక్‌ 971.10 2.26
బ్రిటానియా 3,606.35 1.80
ఇన్ఫోసి్‌ 1,414.50 1.79
టాటా కన్జూమర్స్‌ 710.25 1.47

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హిందాల్కో 386.40 -2.18
టాటా స్టీల్‌ 1,109.20 -1.73
JSW స్టీల్‌ 705.50 -1.43
పవర్‌గ్రిడ్‌ 232.90 -1.42
ఐసీఐసీఐ బ్యాంక్‌ 640.80 -1.14

Related Articles