జగన్‌ పాలసీతో మనం వెనక్కి వెళతాం

మెరుగైన జీవితం కోసం మనిషి నిరంతరం తపన పడుతుంటారని.. సాహసాలు చేస్తుంటారని… దానికి ఎపుడూ ప్రోత్సాహం ఉండాలని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్ల విషయమై జరుగుతున్న గొడవకు సంబంధించి ఆయన ఇటీవల పలు టీవీ ఛానల్స్‌లో వివరంగా చెప్పారు. అదే అంశాలను మరింత క్లుప్తంగా, అందరికీ అర్థమయ్యే చెబుతూ ఓ వీడియో తన యూట్యూబ్‌ ఛానల్‌లో పెట్టారు. మొత్తం సమస్యను విడమరిచి చెబుతూ… ఎక్కడ ప్రభుత్వం తప్పు చేస్తోందో వివరించి చెప్పారు. అనేక సాహసాలు చేయడంతోనే అనేక కొత్త ఆవిష్కరణలు వస్తాయి. అలాంటి సాహసమే రాజమౌళి, శోభు యార్లగడ్డ చేశారని… వారి సాహసానికి ప్రోత్సహమే తెలుగు పరిశ్రమకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు అని రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. ఈ వ్యవహారంపై వర్మ ఏమన్నారో వీడియో చూడండి.

Related Articles