ఆర్టీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్‌

ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. ఏ హీరోకు ఇంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదని’ మంత్రి పేరి నాని ట్వీట్‌ చేశారు.

సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే.. మెడికల్‌, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించడం లేదు. ధియేటర్లలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం చెబుతోందని’’ ట్వీట్‌ చేశారు. ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందని ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రమని చెప్పారు. ఎవరికి వర్మగారూ? అమ్మే వారికా?.నిర్మాతల శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్‌ యాంగిల్‌ను గాలికొదిలేశారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మగారూ.. అంటూ ట్వీట్‌ చేశారు.

Related Articles