మన తెలుగు రాష్ట్రాల్లో శ్మశానాలకు మినహా అన్ని ప్రభుత్వ పథకాలపై సీఎం బొమ్మ ఉంటుంది. బతికి ఉండగానే వారి పేర్లు కూడా పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా శ్మశానానికి కూడా వీరి పార్టీ రంగులు వేసుకుంటున్నారు. ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతలు కూడా తన పేరుతో కానుకలు ఇచ్చారు. తమిళనాడులో పాలనలో సమూల మార్పులు తెస్తున్న సీఎం స్టాలిన్ ఈ ఏడాది కూడా 21 రకాల వస్తువలతో పొంగల్ కానుక ఇచ్చారు. చెరకు గడ, పప్పులు, బెల్లం, నెయ్యితో పాటు అనేక ఆహార వస్తువులు ఉన్న సంచిని పంచి పెట్టారు. చిత్రమేమిటంటే సంచిపై కాని… అందులో ఉన్న వస్తువులపై కాని ఎక్కడా స్టాలిన్ బొమ్మ లేకపోవడం. ప్రభుత్వ చిహ్నంతో వీటిని పంచడం. జనం సొమ్ము జనానికి ఇస్తూ తమ ఫొటో, తమ పేర్లు పెట్టుకున్న మన తెలుగు నేతలకు ఎడపు జ్ఞానోదయం అవుతుందో మరి?