ఈనెల 3వ తేదీన ఆత్మహత్య చేసుకున్న మండిగ నాగ రామకృష్ణ ఘటనల వనమా రాఘవేంద్రరావు, మండిగ సూర్యవతి, కొమ్మిశెట్టి లోవ మాధవిలపై పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్పీ రోహిత్ మీడియాకు తెలిపారు. రామకృష్ణ, అతని కుటుంబ సభ్యుల మృతిపై రామకృష్ణ బావమరిది ఎలిశెట్టి జనార్దన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 12 కేసుల్లో రాఘవను దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఆస్తి విషయంలో చేసిన అన్యాయం చేయడమేగాక, తన భార్యను లైంగికంగా కోరడం వలన రామకృస్ణ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. మండిగ నాగ రామకృష్ణ , అతని భార్య శ్రీలక్ష్మి, చిన్న కుమార్తె సాయి సాహిత్య కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. 80 % శాతం కాలిన గాయాలతో పెద్ద కుమార్తె సాయి సాహితి కూడా ఈనెల 5న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని పేర్కొన్నారు. కేసు నమోదు అయినప్పటి నుండి వనమా రాఘవేంద్రరావు పరారీలో ఉన్నాడని, నిన్న రాత్రి Nexon Car No. T528L 0001లో హైదరాబాదుకు వెళ్తుండగా మందలపల్లి క్రాస్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా వనమా రాఘవేందర్ రావు, ముక్తివి గిరీష్, కొమ్ము మురళీ కృష్ణను దమ్మపేట ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ఇవాళ కోర్టులో నిందితులను హాజరు పరుస్తామని పేర్కొన్నారు.