ఏపీ సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు అక్రమ అరెస్టులు, కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడుతున్నారని గతేడాది కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ రాశారు. సీఐడీ విభాగంలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై అక్రమ కేసులు మోపుతున్నారని, అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే ఈ విధంగా చేస్తున్నారని హోంశాఖకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్‌లో రాసిన లేఖపై కేంద్రహోంశాఖ కార్యదర్శి స్పందించారు. ఈరోజు పోస్టులో లక్ష్మీనారాయణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారులు లేఖ పంపారు. కేంద్ర హోంశాఖ పంపిన లేఖలో ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.