గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై వైసీపీ శ్రేణుల దాడి, హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డీపీపీకి లేఖ రాశారు. టీడీపీ నేతలు దొంతు చిన్నా, పట్టాభి భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఉందని, వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని మండిపడ్డారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్‌పై వైసీపీ రౌడీలు దాడి చేసి ధ్వంసం చేశారని, అక్కడ ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారన్నారు. దొంతు చిన్నాకు చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారని, పట్టాభిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారా?.. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా?… నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధిస్తూ.. పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. గన్నవరంలో దాడుల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. టీడీపీ, వైసీపీ కార్యాలయాల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Related Articles
ఇది కేవలం జగన్ కక్ష సాధింపే
- February 29, 2024
అబ్బాయి కిల్డ్ బాబాయ్
- February 24, 2023
చంద్రబాబు, విజయసాయి ఫోటోపై బండ్ల గణేష్ ట్వీట్
- February 20, 2023
నేనేం పాకిస్థాన్ నుంచి వచ్చానా..
- February 18, 2023
వైసీపీ.. రాష్ట్రానికి పట్టిన శని..
- February 17, 2023
సునీల్ కుమార్‌పై చర్యలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు
- February 14, 2023