విశాఖ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. బిడ్డ మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్లే స్తోమత లేక స్కూటీపై 120 కిలోమీటర్లు తీసుకెళ్లారు. కేజీహెచ్‌లో చనిపోయిన బిడ్డను తీసుకెళ్తేందుకు ఆర్థిక స్తోమత లేక ఆ తల్లిదండ్రులు.. అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రాధేయపడ్డారు. కానీ ఎంత బతిమాలినా ఆస్పత్రి సిబ్బంది కనికరపడలేదు. ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో గత్యంతరం లేక మృతదేహాన్ని స్కూటీపై పెట్టుకుని పాడేరు వరకు 120 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అక్కడ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ఆస్పత్రి సిబ్బంది.. పాడేరు నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపించారు.