పెళ్లి చేసుకుంటానని జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి జూనియర్ ఆర్టిస్ట్, యూట్యూబర్ అయిన యువతిపై పలుమార్లు అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతికి 2021లో గుంటూరు జిల్లా కాకాని ప్రాంతానికి చెందిన రోహిత్ ఖాన్‌ పరిచయమయ్యాడు. ఆమె 2021 సెప్టెంబర్‌లో నగరానికి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ బోరబండలో నివాసం ఉంటుంది. ఆ యువతి ఫోన్ నెంబర్ సంపాదించిన రోహిత్ ఖాన్ తరచూ ఆమెకు ఫోన్ చేసేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకొమ్మని బాధితురాలు పలుమార్లు కోరినా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles