తనపై టీడీపీ ఆరోపణలు చేసిందని.. దీనిపై విచారణ జరపాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీబీఐకి వినతి పత్రం ఇచ్చారు. విశాఖలో సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన.. ముందుగా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. 800 కిలోమీటర్లు ప్రయాణించి సీబీఐ ఆఫీసుకు వచ్చానన్నారు శివప్రసాద్ రెడ్డి. టీడీపీ దయవల్ల ఇక్కడకు వచ్చానని.. ఏ ఎమ్మెల్యేకు సీబీఐతో పని ఉండదన్నారు. ఏ ఎమ్మార్వోనో జిల్లా అధికారులతో పని ఉంటుందన్నారు. కానీ తాను టీడీపీ విష ప్రచారం వల్ల నేను ఇక్కడ కు వచ్చానని.. లోకేష్ రెండు సార్లు ప్రొద్దుటూరు వచ్చి తనపై అనేక ఆరోపణలు చేశారన్నారు. నారా లోకేష్, ప్రొద్దుటూరు టీడీపీ నేతలు తనపై చేసిన అసత్య ఆరోపణలపై విచారణ చేపట్టాలని సీబీఐని కోరానన్నారు. తాను దొంగనోట్లు ముద్రిస్తున్నానని, లిక్కర్ మాఫియా, మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్‌లు చేస్తూ వచ్చిన మొత్తంతో రాజకీయం చేస్తున్నట్లు లోకేష్, టీడీపీ నేతలు ఆరోపణలు చేశారన్నారు. వాటిపై సీబీఐతో విచారణ చేయించుకోవాలని వారు చేసిన సవాలును స్వీకరించానన్నారు. అందుకే సీబీఐ విచారణ చేయాలని తానే కోరానన్నారు.
Related Articles
మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీకి
- February 28, 2023
నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి
- February 24, 2023
వివేకాను చంపింది వాళ్లే..
- February 23, 2023
గన్నవరంలో విధ్వంసకాండ
- February 21, 2023
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు
- February 21, 2023
పెళ్లి చేసుకుంటానని జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం
- February 18, 2023