టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ ఆల్ టైం రికార్డును బద్దలుకొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 25 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. మూడో రోజు ఆటలో భాగంగా నాథన్ లయన్ బౌలింగ్‌లో కోహ్లీ ఫోర్ కోట్టి 25 వేల మార్కును అందుకున్నాడు. సచిన్ 577 మ్యాచ్‌లకు 25 వేల రన్స్ చేయగా.. విరాట్ కేవలం 549 మ్యాచ్‌లతో ఈ రికార్డును చేరుకున్నాడు. సచిన్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ (588 మ్యాచ్ లు), దక్షిణాఫ్రికా ఆటగాడు జకస్ కల్లిస్ (594), శ్రీలంక మాజీ కెప్టెన్‌లు కుమార సంగక్కర (608), మహేల జయవర్దనె (701) ఉన్నారు.