కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కారు చోరీ

కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. సైదాబాద్‌ ఇంట్లో కారును దుండగులు దొంగిలించారు. ఇన్నోవా కారు కీస్ వెతికి కారుతో పరారయ్యారు. సైదాబాద్ పోలీసు స్టేషన్‌లో ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసు ప్రొటెక్షన్ కావాలంటూ గతంలో ప్రవీణ్‌.. పోలీసులను కోరారు. తనకు, తన కుటుంబానికి రక్షణగా గన్‌మెన్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ కోరారు. తన ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలని ప్రవీణ్ విన్నవించారు.

Related Articles