మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ మాదాపూర్లోని శరణి నివాసంలో సీఐడీ తనిఖీలు నిర్వహిస్తోంది. మనీ రూటింగ్కు పాల్పడి అమరావతిలో భూముల కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించగా.. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్లు సీఐడీ వర్గాలు వెల్లడించాయి.