RRR మొబైల్‌ ఫోన్‌ మిస్టరీ?

ఇపుడు ఏపీలో రఘు రామకృష్ణ రాజు మొబైల్ ఫోన్‌ మిస్టరీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం నిన్నటి నుంచి రాజకీయ, అధికార వర్గాల్లో నానుతోంది. మే 14వ తేదీన తనను అరెస్ట్‌ చేసిన రోజు ఏపీ సీఐడీ అధికారుల తన ఫోన్‌ను లాక్కున్నారని, కోర్టుకు సమర్పించిన నోట్‌లలో ఎక్కడా తన ఐఫోన్‌ ప్రస్తావన లేదని … కాబట్టి సీఐడీ అధికారులు వెంటనే మెజిస్ట్రేట్‌కు అప్పగించాలని చెబుతూ ఏపీ సీఐడీ అడిషినల్ డీజీపీకి లీగల్‌ నోటీసు ఇచ్చారు. ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతుండగా ఇవాళ ఏపీ మాజీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ ఓ అంశాన్ని ట్వీట్‌ చేశారు. తాను కావాలని దీన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెడుతున్నానని చెప్పారు. ఆయన ట్వీట్‌ చేసిందేమింటే తమ దగ్గర లేని నంబర్‌… +91 90009 1111 ఫోన్ నంబర్‌ నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు వాట్సప్‌ మెసేజ్‌లు వస్తున్నాయని, అది ఎంపీ రఘు రామకృష్ణ రాజు నంబర్‌ అని అనుకుంటున్నానని.. దీనిపై ఎంపీ స్పందించాలని కోరారు. దీనికి రాజు స్పందించారు. మే 14న తన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఇప్పటికీ ఆ ఫోన్‌ వారి దగ్గరే ఉందని, నిన్ననే సీఐడీ అధికారులకు లీగల్‌ నోటీసు ఇచ్చానని అన్నారు. నాలుగు రోజుల క్రితం సదరు నంబర్‌ను బ్లాక్‌ చేసి, కొత్త సిమ్‌ తీసుకున్నానని చెప్పారు. మే 14వ తేదీ నుంచి తాను ఎవరికీ మెసేజ్‌లు పంపలేదని, ఒకవేళ ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్‌ లేదా ఇతర అధికారులు నిబంధనలను ఉల్లంఘించి ఉంటే చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవచ్చని రాజు అన్నారు. సో… రఘు రామకృష్ణ రాజు ఫోన్ నుంచి ఎవరెవరికి, ఎవరు మెసేజ్‌లు పంపుతున్నట్లు? ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం సస్పెన్స్‌లో ఉండిపోయింది. పీవీ రమేష్‌ తమకు మెసేజ్‌లు వస్తున్నాయని చెప్పారే గాని… ఎప్పటి నుంచో చెప్పలేదు. ఎందుకంటే నాలుగు రోజుల నుంచి సిమ్‌ రాజు వద్దనే ఉంది, అంతకుము ఫోన్‌ సీఐడీ అధికారుల వద్ద ఉందని రాజు చెబుతున్నారు. వెంటనే స్పందించినందుకు పీవీ రమేష్‌ థ్యాంక్స్‌ చెప్పారు. మరి పీవీ రమేష్‌కు ఎప్పటి నుంచి మెసేజ్‌లు వస్తున్నాయో చెబితే… ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఆ సమాచారం మాత్రం రమేష్‌ పెట్టలేదు… సస్సెన్స్‌ కొనసాగుతోందన్నమాట.

Related Articles