కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ వైద్యులు విడుదల చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగ్గా ఉందని, నిపుణులైన వైద్య బృందం ప్రీతిని నిశితంగా పరిశీలిస్తోందని, ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్‌లో పేర్కొన్నారు. ఎక్మోపైనే ప్రీతికి చికిత్స అందిస్తున్నామని, ఆమె శరీరం చికిత్సకు స్పందిస్తోందని నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రీతి శ్వాస తీసుకోలేకపోవడంతో ఎక్మో అమర్చినట్లు తెలిపారు. ప్రీతికి ఐదుగురు డాక్టర్ల బృందం వైద్య చికిత్స అందిస్తోందని, అందులో అనస్తీపియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్లు ఉన్నారని నిమ్స్ వైద్యులు చెప్పారు.