ఐదు రోజులు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూసిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రీతి ఘటనను కొందరు రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో గొడవలు, ర్యాగింగ్ కారణంగా మనస్థాపానికి గురై.. ప్రీతి అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్న కేటీఆర్.. అందుకు కారణమైన వాళ్లు ఎవ్వరైనా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రీతి విషయం తెలిసి.. మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్పందించారని.. విద్యార్థిని బతికించుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేశామని కేటీఆర్ వివరించారు. దురదృష్టవశాత్తు.. ప్రీతి మరణించిందన్నారు. అయితే.. కొందరు మాత్రం ప్రీతి ఘటనపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర మల్లర మాటలతో.. మతం, కులం రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసింది.. సైఫ్ అయినా.. సంజయ్ అయినా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రీతి కుటుంబానికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Related Articles
స్వగ్రామానికి చేరుకున్న ప్రీతి మృతదేహం..
- February 27, 2023
నేడు హనుమకొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన
- February 27, 2023
సీనియర్లంతా ఒక్కటయ్యారమ్మ..
- February 26, 2023
ప్రీతి హెల్త్‌పై లేటెస్ట్ అప్డేట్
- February 24, 2023