సంచలనం రేపిన అబ్ధుల్లాపూర్‌మెట్ హత్యోదంతం రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
ప్రాణ స్నేహితుడైన నవీన్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన హరిహరకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. అయితే.. ఈ నేపథ్యంలోనే కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రేమకి అడ్డున్నాడనే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేశాడు. నిందితుడు హరిహరకృష్ణ మూడు నెలల ముందే నవీన్ హత్యకు స్కెచ్ వేశాడు. రెండు నెలల క్రితం మలక్‌పేట్ సూపర్ మార్కెట్లో కత్తి కొనుగోలు చేశాడు. ఈ నెల 17న పక్కా ప్లాన్ ప్రకారం గెట్ టుగెదర్ పార్టీ పేరుతో నవీన్‌ను హరిహరకృష్ణ హైదరాబాదుకు పిలిపించాడు. హత్యకు ముందు పెద్ద అంబర్ పేట్ వైన్స్‌లో నవీన్, హరిహరకృష్ణ.. ఇద్దరు కలిసి పీకల దాకా మద్యం సేవించారు. మద్యం మత్తులో యువతి విషయంలో ఇద్దరి మద్య ఘర్షణ చెలరేగింది. అనంతరం ఇద్దరు కలిసి ఓఆర్ఆర్ సమీపంలో నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ హరిహరకృష్ణ పథకం ప్రకారం నవీన్‌ను గొంతునులిమి హత్య చేశారు. ఆ తర్వాత కత్తితో నవీన్ శరీరాన్ని విడిబాగాలుగా చేశాడు. తల, వేళ్లు, గుండె, మర్మాంగం, దుస్తువులు ఇతర శరీర విడిభాగాలను బ్యాగులో వేసుకొని అక్కడి నుంచి బ్రాహ్మణపల్లి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి పడేశాడు. అనంతరం హరిహరకృష్ణ పక్కనే ఉన్న ఫ్రెండ్ హసన్ ఇంటికి వెళ్లాడు. స్నానం చేసి డ్రస్ మార్చకుని తీరిగ్గా.. ఫ్రెండ్ హసన్‌కు హత్య విషయం చెప్పాడు. మరుసటి రోజు ప్రియురాలికి సైతం హత్య విషయం తెలిపాడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నంకు హరి హరకృష్ణ పారిపోయాడు. అనంతరం తండ్రికి విషయం చెప్పడంతో తండ్రి పోలీసులకు లొంగిపొమ్మని సూచించాడు. దీంతో నిందితుడు హరిహరకృష్ణ 24న తిరిగి హైదరాబాద్‌కు చేరుకొని హత్య స్పాట్‌కి వెళ్లి శరీర విడిబాగాలు సేకరించి దహనం చేశాడు. 24 సాయంత్రం హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు.