సాత్విక్‌ను బూతులు తిట్టి, చితకబాదారు

నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో విద్యార్ధి సాత్విక్ క్లాస్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాత్విక్ మృతిపై ఇంటర్ బోర్డు కమిటీ వేసి విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను కూడా వెల్లడించింది. ఇక, సాత్విక్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టు ప్రకారం.. కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ చనిపోయాడు. సాత్విక్‌ను బూతులు తిట్టడం వల్లే మనస్తాపం చెందాడు. విద్యార్ధుల ముందు కొట్టడంతో హర్ట్ అయ్యాడు. ఆచార్యతో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచూ తిట్టడంతో మనస్తాపానికి లోనయ్యాడు. చనిపోయిన రోజు స్టడీ అవర్‌లో ఆచార్య, కృష్ణారెడ్డి.. సాత్విక్‌ను చితకబాదారు. హాస్టల్‌లో సాత్విక్‌ను వార్డెన్ వేధించాడు అని స్పష్టం చేశారు.

Related Articles